15, మార్చి 2009, ఆదివారం

నా తరై

చాలా రోజుల క్రితం "బాబాయ్ అబ్బాయి" అని జంధ్యాల గారి సినిమా ఒకటి వచ్చింది - బాలకృష్ణ, "సుత్తి" వీరభద్రరావు ముఖ్య తారాగణం. దాంట్లో "సుత్తి" గారి ఊత పదం "నా తరై". దానికి అర్ధం అప్పట్లో నాకు తెలియలేదు. కాని కొన్నాళ్ళ తర్వాత కరుణానిధికి కళ్ళద్దాలు లాగా, రజనీకాంత్ కి సౌండ్ లాగా ఎప్పడు నా వెంట ఉండే దురదృష్టం నన్ను లటుక్కని లాగేసి చెన్నై అనబడు చీకటి కూపం లోకి తోసేసింది. అక్కడ ఎటు చూసినా జాంగ్రీలు జిలేబిలు కలిపి వేసేసినట్టు ఉండే అక్షరాలు, గులకరాళ్ళని గ్లాసులో వేసి గిరా గిరా తిప్పినట్టు ఉండే శబ్దాలు అర్ధమయ్యి అలవాటయ్యాక తెలిసింది గురువుగారి చమత్కారం. అప్పటి నుంచి ఆ పదం నాకు తెగ నచ్చేసింది("నా తరై" అంటే నేను ఇస్తాను అని అర్ధం. మీకు కూడా గురువుగారి చమత్కారం అర్ధం కావాలంటే మీరు ఆ సినిమా చూడాల్సిందే).



ఎందుకో తెలియదు గాని అరవ వాళ్ళుఅంటే గురువుగారికి కూసింత కచ్చి అని నా అభిప్రాయం. రెండు సంవత్సరాలు చెన్నైలో కాలాపానీ అనుభవించాక నా అభిప్రాయానికి ఊతం వచ్చింది. నాకు జీవితం అంటే విరక్తి వచ్చింది. అర్ధరాత్రి ఐదు గంటలకి చూసినా తెల్లవారు ఝామున తొమ్మిది గంటలకి చూసినా సిటీ బస్సుల్లో నిండా జనం, రజనీకాంత్ కి జుట్టు మొలిస్తే చూడటానికి వెళ్తున్నట్టు, బాలకృష్ణ సినిమా ఇంటెర్వెల్లో గేట్లు తీసేసినట్టు, జనం.



శివుడికి నెత్తి మీద గంగ ఉందో లేదో తెలియదు గాని అక్కడ సిటీ బస్ లో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరూ ఒక శివుడే. ప్రతి ఒక్కరూ కైలాసం నుంచి దిగి వచ్చిన ఫీలింగ్‌కి లోనవుతారు. ఇలా అనటానికి సర్వాంగాలని తడిపేసే గంగా ప్రవాహం ఒక్కటే కారణం కాదు. బస్సులో ప్రయాణించే శివంగులు కూడా. అక్కడ అందరు ఆడవాళ్ళు పొద్దున్నే లేచి పూజ చేసి, కమండలంలో నీళ్ళు నింపుకుని, బస్ ఎక్కుతారు. పురుష శ్పర్శ్య కాదు కదా ప్యాంట్ నీడ పడినా శపించేస్తారు. అందుకనే అక్కడ బస్ ఎక్కగానే అందరు మగవాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేస్తారు - "ఈ బస్ లో ప్రయాణించే ఆడవాళ్ళు అందరు నాకు చెల్లి లేదా కూతురితో సమానం (మీకు అభ్యంతరం లేకపోతే అక్కా లేదా తల్లి అని కూడా ఫిక్స్ అవ్వచ్చు). వాళ్ళని నేను తాకను. తాకినా ఆనందపడను. ఆనందపడినా వాళ్ళకి తెలిసేలా ఆనందపడను.సూపర్ గుడ్ ఫిల్మ్స్ లొ హీరొలా ఎస్.ఏ.రాజ్ కుమార్ సంగీతానికి స్టెప్స్ వేస్తూ బస్ దిగుతాను. అందరి సానుభూతి చూరగొంటాను".



చెన్నై గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం ప్రస్తావించవలసిన ఇంకొక గొప్ప విషయం - నీరు. బంగారం లాంటి నీరు. నేను చెప్తున్నది నీటి రంగు గురించి. ప్రతి వీధికి ఒక గుడిని చూసి వాళ్ళ దైవభక్తికి అబ్బురపడిన నేను, వాటర్ టాంకెర్ దగ్గర నీళ్ళ కోసం వాళ్ళు చేసే వయొలెన్స్ చూసి విస్మయం చెందాను. కొన్నాళ్ళకి ఆ ఫీలింగ్ వికారంగా రూపాంతరం చెందింది. అన్ని రంగాల్లో అణగతొక్కబడ్డ స్త్రీలు ఈ విషయం లొ మాత్రం అక్కడ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. (చెన్నైలొ నూటికి నూటపదిమంది వాటర్ టాంకర్ లొ వచ్చే నీళ్ళ మీద ఆధారపడతారు). వాటర్ టాంకర్ రాగానే రంగు రంగుల బిందెలతో, నోటినిండా బూతులతో లబ లబ మంటూ ఆడవాళ్ళు , వాళ్ళతో పాటు కలం కాగితాలతొ ఆహా ఓహొ అంటు కొంతమంది మగవాళ్ళు వచ్చేస్తారు. మొదట్లో ఈ రెండో బ్యాచ్ ఎవరొ అర్ధం కాలేదు. తర్వాత తెలిసింది వాళ్ళు కొత్త సినిమా పేర్లు కొసం, డైలాగ్స్ లొ పంచ్ లైన్స్ కొసం వెతుక్కునే తమిళ సినీ రైటర్స్ అని (ఈ మధ్యనే శింబు హీరో గా రిలీజ్ ఐన "నాటుకట్టి అడిపట్టి" అనే సినిమా టైటిల్ అక్కడ నుంచి వచ్చినదే. దీనిని తెలుగులోకి "కపాలం కన్నుకొట్టింది" అన్న పేరుతో డబ్ చెయ్యబోతున్నారు.)



నీళ్ళ విషయంలో చెన్నై వాసులకి దేవుడు చాలా అన్యాయం చేసాడని అక్కడి వాళ్ళ గట్టి నమ్మకం. నాకు ఈ విషయం ఎలా తెలిసిందంటే ఒక రొజు ఎదురింటి ఆర్ముగం గాడు ప్రార్థన చేస్తుండగా విన్నాను. "దేవుడా!! ఓ మా మంచి దేవుడా! మాకు అన్నీ ఇచ్చావు. తాగటానికి సాంబార్ ఇచ్చావ్, తినటానికి ఇడ్లీలు ఇచ్చావ్, ఎత్తుకోవటానికి లుంగీలు ఇచ్చవ్, లోపల వేసుకున్నా బయటకి కనిపించేటట్టు చారల చడ్డీలు ఇచ్చావ్, ఎండా కాలంలో ఎండ ఇచ్చావ్, చలి కాలం లొ కూడ ఎండ ఇచ్చావ్, వర్షం పడినప్పుడు బురద ఇచ్చావ్, వర్షం పడనప్పుడు గబ్బు ఇచ్చావ్, అరవటానికి "అరవం" ఇచ్చావ్("అరవం" "అరవం" అంటూనే ఎందుకు అంత అరుస్తారో నాకు అర్ధం కాదు), కంటి నిండా సరిపోయే హేరోయిన్లని ఇచ్చావ్. కాని దేవుడా! ఇన్ని ఇచ్చిన నువ్వు ఎందుకు కావేరిని మాత్రం కర్ణాటకకు ఇచ్చావ్??!!!"

33 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. chaala baghaa raasaru...baavundhie...just chinchaaru

    రిప్లయితొలగించండి
  3. నేను , మా ఆవిడా ఈమధ్య చెన్నై లో రెండు రోజులు వున్నాం, వీసా కోసం. ఆటో వాడు నా చేత చెమటలు పట్టిచారు, పక్కనే వున్నే ప్లేస్ కి వెళ్తే తక్కువ లో తక్కువ యాబై రూపాయలు వసూలు చేసారు.సరే, ఎలాగో ఇబ్బంది పడి బీచ్ కి వెళ్ళాం, చెన్నై లో అంత మంది జనాలు వుంటారు అని అప్పుడే తెలిసింది, మన వూరిలో తిరణాలుకు కోడా ఇంత మంది జనం రారు. చిరాకుతో బస్ స్టాప్ ముందు కూర్చునాం. ఇంత లో మా ఆవిడా కాఫీ తాగుదాం అని అంది. సరే లే చెన్నై వాళ్లు కాఫీ లేందే బతకలేరు కదా అని , కాఫీ చెప్పం. వాడు ఏదో చిన్న కప్ లో ఇచ్చాడు. పది రూపాయలు కోడా తీసుకున్నాడు . అది తాగానే ఇద్దరం కడుపు పగిలేలా నవ్వుకునం, ఎందుకో అర్ధమయ్యింది అనుకుంటా? చిన్నప్పుడు తిన్న దంత బయటుకు వొచ్చే పని అయ్యింది. తరువాత, అక్కడ నుంచి బయట పడ టి నగర్ వెళ్ళాం, అక్కడ కోడా అంతే, జనం, ఈ లోగా చెమాటలు, వర్షం పడినప్పుడు కూడా అంత లాగ తడవం. అప్పుడే నేను ఒక నిరణ్యం తీసుకున్నా , ఇంక ఎప్పుడు చెన్నై రా కూడదు అని.

    రిప్లయితొలగించండి
  4. Wonderful post. "దేవుడా" అదిరింది. మరిన్ని పోస్టులు వ్రాయండి

    రిప్లయితొలగించండి
  5. Posting is nice and funny. Presentation is very good in terms of what the author wants to tell. Author focused only on general problems like water and city buses, if I understand correctly. They are the problems in that place. Most of the big cities have such problems. Of course heat & humidity are high in Chennai. More interactive examples with elaborated (funny) analysis is required if the author wants to cover the problem with the people. I know some Tamils are very tough. I had very very good experience as well as very very bad experience with Tamils, both possible only with Tamils. Please keep posting like this.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. Excellent Blog...the last two paragraphs are simply hilarious....The blog overall drew a sarcastic tone and is very amusing to read.Keep Blogging....Babitha.

    రిప్లయితొలగించండి
  8. రచ్చ గురూ... అసలు మద్రాసు అంటేనే నాకు చెమటలు స్తార్ట్ ఔతాయి ఇంక అక్కడ ఉండడం అంటే ఎదో పూర్వజన్మ పాప ఫలమే.. ;-)

    రిప్లయితొలగించండి
  9. Excellent post.....
    keep it up..........
    chennai anteyney bhayapadeetattu cheesaaru :)

    రిప్లయితొలగించండి
  10. mee address kaasta cheputaara?! avatala karunanidhi garu line lo vunnaru!

    రిప్లయితొలగించండి
  11. phani

    tinnavvv neelo oka katdhakudu ippudu bytapaddadu, parchuri kaasukooo

    pappu

    రిప్లయితొలగించండి
  12. devuda,
    nevi ento daya gala vaadivi.
    ee telugu vaallaku jandyala, trivikram to paatu ee phani ni kooda ichchavu.

    రిప్లయితొలగించండి
  13. evari feeling vaalladhi...
    adhey tamil vaadu ikadaku vachhi(hyderabad) golti gaallaku naagarikathey theliyadhantaadu...
    ( ikkadunna lethargy ni choosi)..
    naa mattuku rendu chotlu istamey...

    రిప్లయితొలగించండి
  14. chaala bagundandi.. mee telugu blog.. chennai meeda chaala mandiki ide abhiprayam undi.. ee hot topic ni chaala cool ga raasaaru :)

    రిప్లయితొలగించండి
  15. నా తరై అనేది నాకు చాలా బాగా నచ్చే dialogue... పోస్ట్ సూపర్ వుంది..కంటిన్యూ చెయ్యండి...నా తరై..

    రిప్లయితొలగించండి
  16. "అరవం" అంటూనే ఎందుకు అంత అరుస్తారో నాకు అర్ధం కాదు....baagundhi...naa tarai ani endhukuntaado balakrishna ki veerabhadrarao cinema lone chebuthaadu....appula vaallaku...cheppi cheppi alavaataipoyindhi antaadu...

    రిప్లయితొలగించండి
  17. మీకు తెలిసినంత చెన్నై ఆ ముఖ్యమంత్రికి, ఆయన కుటుంబ మంత్రివర్గానికి తెలియదు అనుకుంటా. మీ పోస్ట్ చదువుతుంటే నాకు నేయా గతం గుర్తిచ్చింది. ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళు కావేరీని ఆపారని కర్నాటకని తిడుతారు. కానీ మనం తెలున్గుగంగని ఇచ్చామని ఒక్కడు కూడా మెచ్చుకోడు

    రిప్లయితొలగించండి
  18. ఆఖరు పారా అదిరింది :-)

    With my due apologies to Tamil population

    రిప్లయితొలగించండి
  19. Hey, you have a great sense of humor. I will keep following this blog. Keep posting. Happy blogging :)

    రిప్లయితొలగించండి
  20. Phani garu mee blog super andi , chennai gurinchi baaga chepparu , chennai baadithulalo nenu oka danni :-).... naaku chennai vellakamundhu daaka valla meedha elanti feeling ledhu , velli vachaka chiraku tho koodina virakthi laanti feeling edo vachindi valla meedha.... auto valla sangathi aithey cheppakkarledhu , Flight charges tho poti pettinattu adugthaaru , Yi facilities ki tho telugu vachina maatladaru karma ki .... mee varnana bagundhi , aadavallu kamdalallo nellu nimpukuni teesukellatam , water tank deggara street fights , aa rendo batch janala utsaahaaku bhale unnayi .... Kompadeesi chennai lo chikkukupoyara enti , assalu march tarvatha nunchi inko post ledhu mee bloglo :-)

    రిప్లయితొలగించండి
  21. చాలా బాగుంది.. మీ వర్ణనలోనే మీ అసహ్యం అర్ధమవుతుంది..
    నేను మూడునాలుగు సార్లు చెన్నై వెళ్ళాను, నాకు కొన్ని ఇలానే అనిపించాయి.., ఒక విషయం మా ఫ్రండ్ చెబితే విన్నాను.. ఆఫీసులకు కూడా సన్నజాజిపూలు, మల్లెపూలు పెట్టుకుని వస్తారంట అమ్మాయిలు.., ఎవరికైనా ఆ వాసన ఎలర్జీ ఉంటే.. వాడిక ఏసీలో తుమ్ముకుంటూ చచ్చాడే అని. ఇది విని చాలా నవ్వుకున్నాం.
    మరలా మీ పోస్ట్ చదివి చాలా నవ్వొచ్చింది..

    రిప్లయితొలగించండి
  22. నాకు ఈ వయస్సులో, కడుపుబ్బనవ్వించి,ఎందుకు కష్టాలు తెప్పిస్తారూ?అంతసేపు నవ్వలేను బాబూ.ఈ మధ్యన వచ్చిన బ్లాగ్గుల్లో ఇంతగా నవ్వింది లేదు.

    GOD BLESS YOU.

    రిప్లయితొలగించండి
  23. Good Comedy! ఆఫీసులో బయటకి నవ్వకుండా ఉండడానికి కష్ట పడాల్సి వచ్చింది.

    "బాలకృష్ణ సినిమా ఇంటెర్వెల్లో గేట్లు తీసేసినట్టు, జనం. "

    "లోపల వేసుకున్నా బయటకి కనిపించేటట్టు చారల చడ్డీలు ఇచ్చావ్"

    "కపాలం కన్నుకొట్టింది"

    అదిరాయి.

    ఇంతకీ నాకిప్పుడే తెలిసిందేంటంటే ఆఫీసులకి కూడా మల్లె పూలు పెట్టుకొని వస్తారని, ఇది మాత్రం నాకు వింటానికి బాగుంది.
    Good Motivator to keep employees.

    రిప్లయితొలగించండి
  24. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.........భయంకరమైన కామెడీ :) చాలా కాలం తరువాత చదువుతున్నాను కడుపు పట్టుకుని నవ్వుకునే టపాని.మీరు తమిళవాళ్ళ గురించి మరీ అంత అలా రాయకండి ప్లీజ్.నేను పొద్దట లేస్తే వాళ్ళ మొహమే చూడాలి.రేపెప్పుడన్నా గభాల్న మీ టపా గుర్తొచ్చి వాళ్ళ మొహం మీద నవ్వేస్తే నాపనేమవుతుందో కాస్త ఆలోచించండి :)

    రిప్లయితొలగించండి
  25. inka nayam blog lo rasaru, evaraina tamilian daggara aneru meeru chustundagane mee kapalam cheta kannu kottinchestaru jagratha.
    dasara ki nenu chennai-trichy-pondichery vellanu lifelo inkosaro chennai velloddu ani oath theesukunnanu(intaku mundu 2times vellanu)....another vishayam for ur info- tamil lo asalu "aravam" ane word ledu, "arivu" ante "telivi" ani ardham, so basically tamilians intelligents kabatti(intellectual capital of India is Chennai ata???) vallani migatha states vallu (andulo manamu kuda vunnamo leka maname vallaki aa birudu ichamo teliyadu kani) arivu or araivu ani ani adi kasta aravam aiyyindi(ata) ekkado chadivanu

    రిప్లయితొలగించండి
  26. mee naatarai ni andhra jyothi sunday 4.2.2012 book lo prachuristunnam.
    - sunday editor, Andhra Jyothi

    రిప్లయితొలగించండి
  27. mee naatarai ni andhra jyothi sunday 4.3.2012 book lo prachuristunnam.
    - sunday editor, Andhra Jyothi

    రిప్లయితొలగించండి
  28. Mee rachanalo chakkati hasyam vundi. Migilina writeups unte post cheyyandi.
    Subbarao,Vizag

    రిప్లయితొలగించండి
  29. I read this brilliant article during my recent trip to India. chaala bagundi, chakkati hasyam. Please keep posting and Good luck.

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి